logo

ఒకే ఒక మార్గము

బైబిల్ ప్రకారముగా, దేవుని దగ్గరకు యేసు ఒకే ఒక మార్గము. వేరే మార్గము లేదు. నీవు మంచిగా జీవించినా, ఎన్నో మంచి పనులు చేసినా అవన్నీ నిన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్లలేవు. నీవు మంచి దయగలవాడవైన, నీ హృదయములోని, మనసులోని పాపముంటుంది. నీ వైపు నుంచి యేసు క్రీస్తు లేకుండా దేవునితో సత్సంబందము పొందుట గాని, నీకు నీవు పరిపూర్ణుడవుగా కానీ కాలేవు. నీవు పాపివని, నీకు యేసు క్రీస్తువారి బలియాగము నీకు కొదువై ఉన్నదని నీవు అంగీకరించాలి.

bilde

యేసు చెప్పెను: “యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” (యోహను 14:6).

"మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను." (అపోస్తులుల కార్యములు 4:12)

"మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు." (1. యోహాను 1:8)

"ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా (పది ఆజ్ఞలు)." (గలతీయులకు 2:16)

"ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు." (రోమీయులకు 3:23-24)