logo

నీవు నీవుగా

నీకు సందేహమున్నప్పటికి, నీ ప్రశ్నలకు సమాదానము దొరకకపోయినప్పటికి, నీవు క్రైస్తవుడవు అయినంతమాత్రాన విశ్వాసములో నీవు బలమైనవాడవని కాదు. అది నీవు మంచివాడవైన, చెడ్డవాడవైనా, గతంలో నీవు ఏమి చేసినా, నీలో నీవు ఎంత మంచిగా ఆలోచించిన, నీకు నీవుగా యేసునొద్దకు వచ్చితీరాలి. ఇది పెద్ద విషయం కాదు గాని చాలా సులువైన ఎంపిక.

bilde

"అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు." (అపోస్తులుల కార్యములు 2:21)

"దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏయే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము." (1 యోహాను 3:20)

"మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు." (2 తిమోతికి 2:13)

యేసు చెప్పెను;"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును." (మత్తయి సువార్త 11:28).

మరియు యేసు చెప్పెను; "అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను." (మత్తయి సువార్త 9:13)

మరియు; "నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను" (లూకా సువార్త 19:10)


[మరిన్ని]