logo

ఒక క్రైస్తవునిగా

దేవుడు నిన్ను కోరుకొనేది, నీవు నూటికి నూరు శాతం మనిషిగా యేసు క్రీస్తుని ఒక రక్షకునిగా విశ్వశించాలని. యేసు క్రీస్తువారి బలియాగము ద్వారా ఒక ఉచిత బహుమానముగా ఆయన నీ కొరకు తన్ను తాను అర్పించుకొనెను.

అంతేకాదు, ఒకరు తప్పిదములనుండి తొలగి, మారుమనసు పొంది, విశ్వాసములో మరింత అభివృద్ది చెంది, క్రీస్తు వలె మారుట అనేది దేవునిచిత్తము. రక్షింపబడుటకుగాని, పరిపూర్ణులగుటకుగాని, ఒక క్రైస్తవునిగా మీకు మీరు సాదించుటకు ఈ ఉచిత బహుమానము ఇదివరకే ఇవ్వబడలేదు. అయితే, దేవుని ఉచిత కృపనుబట్టి అర్హతలేని మిమ్ములను యేసు రక్షించెను.

bilde

ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడగుటకు, మీరు రెండు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి మరియు కొన్నిసార్లు, రెండు అడుగులు వెనక్కి, ఒక అడుకు ముందుకు వేద్దామని అనుకోవచ్చు. ఒక ముఖ్య విషయమేమిటంటే, యెల్లప్పుడు క్రీస్తుకు అతి చెరువువై ఎన్నడూ ఆయనకు వేరుగా దాచుటకు ప్రయత్నిచవద్దు. నీకు తెలిసి నీవు ఎప్పుడైనా తప్పిదము చేసినట్లైతే, వెంటనే ఆయనను క్షమాపన అడుగు. యేసే నీ కాపుదల. నీవు జీవించినంతకాలము, ఆయన నీకు అవసరము.

“అలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?”... “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.” (రోమా 6:1 & 14)

యేసు చెప్పెను: "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు." (యోహాను 15:5)

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." (1 యోహాను 1:9)

మీరు ఒక మంచి క్రైస్తవ సహవాసముతో గాని/క్రైస్తవ సంఘముతో గాని పాలిభాగస్తులై; ఇతర క్రైస్తవుల సహవాసము పొంది, దేవుని వాక్యముతో పాలుపంచుకోవాలని రూఢిగా సిఫార్సు చేయుచున్నాము.

ఇంతవరకు మీరు బాప్తీస్మము పొందకపోతే, మీరు ఒక క్రైస్తవ పాస్టర్ తో గాని క్రైస్తవ సంఘమును గాని సంప్రదించి ప్రభువైన యేసు క్రీస్తు నామమున బప్తీస్మము పొందమని మేము కూడా నిన్ను కోరుచున్నము.

బైబిల్ తెలియచేస్తున్నట్లుగా: “......మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” (అపోస్తులుల కార్యములు 2:38)